రిలేషన్‌షిప్‌లో ఉన్నా! విజయ్ దేవరకొండ..
TV9 Telugu
02 April 2024
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నానని అన్నారు టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.
తన తల్లిదండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని చెప్పారు టాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యామిలీ స్టార్.
ఆయన హీరోగా నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఈ చిత్రంలో హీరో కేరక్టర్ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని ప్రమోషన్స్ లో అన్నారు సినిమా హీరో విజయ్ దేవరకొండ.
ఇలాంటి కథలో భాగమైనందుకు ఆనందంగా ఉందని చెప్పారు విజయ్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
కొత్త దర్శకులతో పనిచేయాలని అనుకోనని అన్నారు హీరో విజయ్. సినిమా బడ్జెట్‌ని, మేకింగ్‌ని హ్యాండిల్ చేయడానికి అనుభవం ఉండాలని చెప్పారు.
అందుకే తాను పనిచేసే దర్శకులు ఒక్క సినిమా అయినా చేసి ఉండాలని ఆశిస్తానని చెప్పారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
దర్శకుల ముందు చేసిన సినిమాల్లో హిట్లు, ఫ్లాపులను పట్టించుకోనని అన్నారు ఫ్యామిలీస్టార్ విజయ్ దేవరకొండ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి