02 April 2024

ఆ మూవీ ఫెయిల్యూర్.. నాకు నేను శిక్ష విధించుకున్న.. విజయ్ దేవరకొండ.. 

Rajitha Chanti

Pic credit - Instagram

 రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. 

ఫ్యామిలీ ఎంటర్టైనర్‏గా వస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‏లో పాల్గొన్న విజయ్ లైగర్ మూవీ గురించి స్పందించారు. 

లైగర్ సినిమాకు ముందు.. ఆ తర్వాత తన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని.. కేవలం ఒక విషయంలో మాత్రమే జాగ్రత్త పడుతున్నానని అన్నారు. 

సినిమా విడుదలకు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని.. మూడు సినిమాల వరకు అలాగే ఉంటానని అన్నారు విజయ్. 

ఇది తనకు తానే విధించుకున్న శిక్ష అని అన్నారు. ప్రస్తుతం విజయ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. లైగర్ సినిమాలో అనన్య పాండే నటించింది. 

అలాగే పెళ్లి విషయంలో తనకు ఎప్పటినుంచో ఓ క్లారిటీ ఉందని.. అమ్మా, నాన్నకు నచ్చకుండా ఏం చేయనని.. వాళ్లకు నచ్చాలని.. ఒప్పించాలని అన్నారు. 

అమ్మనాన్నలకు నచ్చేటట్లు ఒప్పించే బాధ్యత మనమే చూసుకోవాలని.. మొత్తం అలా వదిలేయలేం కదా.. పెళ్లి చేసుకున్న రాబోయే 30 ఏళ్ల బతకాలి కదా..

అన్ని జాగ్రత్తగా చేసుకుని వాళ్లకు నచ్చేటట్టు చేసుకోవాల్సింది మనమే అని.. అందుకు ఇంకా చాలా సమయం ఉందని అన్నారు విజయ్ దేవరకొండ.