తండ్రి పాత్రలో రౌడీ హీరో.. ఎవరికంటే.?
TV9 Telugu
26 May 2024
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తున్నారు.
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ పూజ కార్యక్రమాలతో మొదలు కానుంది. 1850 టైమ్లో ఈ కథ నడుస్తుందని తెలిపారు మూవీ మేకర్స్.
బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారని తెలుస్తుంది.
దీనికి రణబలి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ పై ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదు మూవీ టీం.
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు, నటి నటులు గురించి మరిన్ని విషయాలు త్వరలోని వెల్లడించనున్నారు మూవీ మేకర్స్.
హిట్స్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందుకుంటున్నారు విజయ్. ఇటీవల ఫ్యామిలీ స్టార్ లో కనిపించరు.
ప్రస్తుతం గౌతమ్ తిన్నానూరి దర్సకత్వంలో ఓ చేస్తున్నారు రౌడీ హీరో. ఇందులో శ్రీలీల కథానాయకిగా నటిస్తుంది.
దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ ఏమి లేదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి