VD12 షూటింగ్ అప్డేట్.. కంగువా న్యూ లుక్..
TV9 Telugu
20 January 2024
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే ఓ తెలుగు సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికంటే ముందే గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమాకు కమిటయ్యారు విజయ్.
అయితే పరశురామ్ కారణంగా దీన్ని హోల్డ్‌లో పెట్టారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చ్ నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారు.
సూర్య హీరోగా శివ తెరకెక్కిస్తున్న అడ్వంచరస్ థ్రిల్లర్ కంగువా. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజాగా సంక్రాంతి సందర్భంగా ఈ చిత్ర రెండో లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.
స్టూడియో గ్రీన్‌తో కలిసి యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దిశా పటాని ఈ సినిమాలో కథానాయకి.
విశాల్, ప్రియా భవానీ శంకర్ జంటగా హరి తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ రత్నం. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటకు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
తాజాగా సంక్రాంతి సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సమ్మర్‌లో రత్నం సినిమా విడుదల కానుందని తెలిపారు మేకర్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి