ఫ్యాన్స్‌కు కోటి రూపాయలు గిఫ్ట్.. దేవరకొండ బిగ్ సర్‌ప్రైజ్..
07 September 2023
ఆఫ్టర్ లైగర్ డిజాస్టర్.. ఖుషీ మూవీతో స్ట్రాంగ్ కంబ్యూక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. అంతే స్ట్రాంగ్ గా తన ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి ఫిక్స్ అయిపోయారు.
వారికోసం ఏకంగా కోటి రూపాయలను ఖర్చు చేసేందుకు వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు విజయ్ దేవరకొండ.
తీసుకోవడమే కాదు.. రీసెంట్ గా జరిగిన ఖుషీ బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్‌లో ఇదే గుడ్ న్యూస్ ను అనౌన్స్ చేశారు.
తన ఫ్యాన్స్‌లో.. ఓ 100 మందిని ఎంపిక చేసి.. తలా లక్ష రూపాయాలు ఇస్తా అంటూ చెప్పి ఈవెంట్లో ఉన్న తన ఫ్యాన్స్ ను ఒక్కాసారిగా ఎమోషనల్ అయ్యేలా చేశారు.
సమంత విజయ్ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఖుషి. ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో పాటలు కూడా సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఇప్పడికే 65 కోట్లకు పైకా వసూళ్లు రాబట్టింది ఈ చిత్రం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి