విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ ! గతంలో ఈ హీరోలిద్దరి మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనేదనే టాక్ ఉండేది.
దానికతోడు ఎప్పుడూ ఏ స్ట్రాంగ్ స్టేట్స్‌మెంట్స్ ఇచ్చినా.. వీరిద్దరూ ఒకరి మీదొకరు ఇస్తున్నారా అనే డౌట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేది.
తాజాగా ఖుషీ బ్లాక్ బాస్టర్ ఈవెంట్లో విజయ్ చేసిన కామెంట్స్ విశ్వక్ మీదికే గురనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఎస్ ! ఖుషీ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ. తాజాగా వైజాగ్‌లో జరిగిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఈవెంట్లో షాకింగ్ కామెంట్స్ చేశారు.
తనపై తన సినిమాపై కొందరు కుట్రలు చేస్తున్నారని.. అటాకులు చేస్తున్నారని.. ఊరు పేరు లేనోళ్లు కూడా ఫేక్ అకౌంట్లతో తప్పుడు రివ్యూలిస్తున్నారని విజయ్ సరదాగానే మండిపడ్డారు.
అయితే విజయ్ చేసిన ఈ కామెంట్స్‌ను.. పాన్ ఇండియన్ మూవీ అని కొందరు గల్లీ రేంజ్ సినిమాలతో ఊదరగొడుతుంటారని గతంలో విశ్వక్ అన్నారు.
గతంలో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ తో పోలుస్తూ.. కొంతమంది నెటిజెన్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
VD Vs PD గా ఈ ఇష్యూను సామజిక మాధ్యమాల్లో ట్రెండీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్.