ఆరోగ్యం - ఆనందం - డబ్బు!

TV9 Telugu

24 March 2024

తాను ఎప్పుడు జీవితంలో కృషి చేసేది మూడే మూడు విషయాలకోసమని అన్నారు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ.

వాటిలో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఆరోగ్యమని చెప్పారు. తానెప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటానని అన్నారు రౌడీ హీరో.

డబ్బుకు కూడా ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. చేతినిండా డబ్బుంటే హెల్త్ ఇష్యూస్‌ ఉన్నా, వైద్యం చేయించుకోవచ్చని తెలిపారు.

చేతినిండా డబ్బు, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆనందం ఆటోమేటిగ్గా వస్తుందని చెప్పారు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.

ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి, ఆనందంగా మనకు నచ్చిన బాగా నచ్చిన పనిచేసినప్పుడు డబ్బు ఆటోమేటిక్ గా వస్తుందని అన్నారు.

అందుకే తానెప్పుడూ కూడా ఈ మూడు విషయాల మీద ఫోకస్‌ చేస్తానని అన్నారు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ.

తనతో పాటు, తన కుటుంబం, తన నియర్‌ అండ్‌ డియర్స్, తన సమాజం ఆనందంగా ఉండాలని అనుకుంటానని చెప్పారు మిస్టర్‌ విజయ్‌ డీ.

ఆయన నటించిన ఫ్యామిలీస్టార్‌కి పాజిటివ్‌ బజ్‌ ఆల్రెడీ క్రియేట్‌ అయింది. అన్ని బాగుంటే ఈ సినిమాకి హిట్ ఖాయం.