హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ట్రెండింగ్‌లో ఉన్న డార్క్ థీము ఇలాంటి సినిమాలే రీసెంట్ డేస్లో బాక్సాఫీస్ బరిలో దుమ్ములేపుతున్నాయి.
అవేం లేకుండా.. జస్ట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఖుషీ సినిమా ఇప్పుడు అందరి మనసులు గెలుచుకుంటు కలెక్షన్ సునామీని కంటిన్యూ చేస్తోంది.
శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సామ్ జంటగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ఖుషీ. ఈ చిత్రం ఈ నెల 1న విడుదలైంది.
రెండు విరుద్ద భావాలున్న రెండు ఫ్యామిలీల నేపథ్యంలో.. హీరో హీరోయిన్ మధ్య పుట్టిన ప్రేమగా.. రొమ్ కామ్‌గా తెరకెక్కిన ఈ సినిమా తాజాగా అందర్నీ ఆకట్టుకుంటోంది.
అటు ఫ్యామిలీ ఆడియోన్స్ను కట్టిపడేస్తూనే.. ఇటు యూత్‌ను విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తోంది. రిలీజ్ అయిన వెంటనే సూపర్ డూపర్ హిట్ అనే టాక్ సొంత చేసుకుంది.
ఇక ఈ క్రమంలోనే ఈ చిత్రం డే 1 వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపుగా 30.1 క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది ఈ సినిమా.!
ఇక డే 1 కలెక్షన్ల ఊపును కంటిన్యూ చేస్తూనే.. డే2 50కోట్లను కొల్లగొట్టింది ది విజయ్ ఖుషీ సినిమా! ఇక ఇప్పుడు డే3కి గాను.. వరల్డ్ వైడ్ 70.23క్రోర్ గ్రాస్ వచ్చేలా చేసుకుంది.
వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ హిట్ అనే ట్యాగ్ వచ్చేలా చేసుకుంటోంది ఖుషీ మూవీ. ప్రస్తుతం థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది ఈ చిత్రం.