TV9 Telugu
ఓ పనైపోయింది బాబూ అంటున్న రౌడీ హీరో విజయ్.
18 March 2024
ఫ్యామిలీ స్టార్‌తో ఓ పనైపోయింది బాబూ అంటున్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఎందుకు అలా అనుకుంటున్నారా.?
ముందు కమిటైన గౌతమ్ తిన్ననూరి మూవీని పక్కనబెట్టి మరీ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ కంప్లీట్ చేసారు రౌడీ బాయ్.
ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తైనట్లు దర్శక నిర్మాతలు ప్రకటించగా.. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్.
ఒక సాంగ్ తో ఫ్యామిలీ స్టార్ షూటింగ్‌కు గుమ్మడి కాయ్ కొట్టేసారు మేకర్స్. ఇకనుండి ప్రమోషన్స్‌పై ఫోకస్ చెయ్యాలి.
సో ట్విట్టర్‌లో ఈవెంట్స్, ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ లోడింగ్ అంటూ ఈ మూవీపై హింట్ ఇచ్చారు ప్రొడ్యూసర్స్.
విడుదలకు మరో కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్ వరసగా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.
గీత గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమానే ఈ ఫ్యామిలీ స్టార్.
టాలీవుడ్ లక్కీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ఫ్యామిలీ స్టార్ మూవీలో విజయ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక్కడ క్లిక్ చెయ్యండి