డీజే టిల్లు మూవీ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే ??

TV9 Telugu

02  April 2024

డీజే టిల్లు సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా రీసెంట్‌గా  వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టైంది.

ఎట్ ప్రజెంట్ కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. దాంతో పాటే హీరో సిద్ధు జొన్నల గడ్డను స్టార్ బోయ్‌ను చేసేసింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యేలా చేసింది.

మరి అలాంటి ఈ సినిమాలో... మొదట సిద్దు జొన్నల గడ్డను కాకుండా మరో హీరోను.. హీరోగా అనుకున్నారట తెలుసా..?

ఫస్ట్ పార్ట్ డీజే టిల్లు సినిమా మొదలెట్టినప్పుడు మొదట సిద్ధును కాకుండా... రౌడీ బాయ్‌ విజయ దేవరకొండను ఈ సినిమాకి హీరో అనుకున్నారట.

విజయ్‌కు ఈ స్టోరీని నరేట్ కూడా చేశారట.. కానీ అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా చేసిన విజయ్‌.. ఆవెంటనే ఇలాంటి సినిమా ఎందుకని అనుకున్నాటర.

దీంతో ఈ సినిమాకు తను సెట్ కాదంటూ పక్కకు తప్పుకున్నారట. దీంతో ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ విమల్ కృష్ణ.. తన ఫ్రెండ్ అయిన సిద్దునే ఈ సినిమాలో హీరోగా ఫిక్స్ చేశారట.

ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా ఓకే అనడంతో.. ఆ సినిమా డీజె టిల్లుగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైయింది. సిద్ధుని స్టార్ బోయ్‌గా టాలీవుడ్‌లో నిలబెట్టింది.