కలియుగ రాముడు.. విజయ్‌

TV9 Telugu

10 March 2024

ప్రస్తుతం సిల్వర్‌స్క్రీన్‌ మీద రామభక్తి విపరీతంగా కనిపిస్తోంది ఆ మధ్య రిలీజ్‌ అయిన ఆదిపురుష్‌ ఫ్లాప్‌ అయింది.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్‌ బ్లాక్ బస్టర్ అయింది. త్వరలోనే నార్త్ లో కూడా రామాయణం తెరకెక్కనుంది.

అయితే, వీటికి ఏమాత్రం సంబంధం లేకుండా సిల్వర్‌ స్క్రీన్‌ మీద సోషల్‌ రాముడు త్వరలోనే కనిపించబోతున్నాడు.

ఎవరా రాముడు అని అంటున్నారా? ఇంకా ఎవరండీ మన రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించే ఇప్పుడు చెప్పబోతున్నాది.

యస్‌... ఆయన ఫ్యామిలీస్టార్‌ సినిమాలో మఫ్టీలో ఉన్న కలియుగ రాముడిలాగా కనిపిస్తారట హీరో విజయ్ దేవరకొండ.

అంటే... ఈ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో విజయ్‌ దేవరకొండ కేరక్టరైజేషన్‌ అలా ఉండబోతోందన్నమాట.

ఫ్యామిలీ కోసం కష్టపడే వ్యక్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ కి కిర్రాక్‌గా కనెక్ట్ అవుతుందట ఇందులో ఆయన కేరక్టర్‌.

సినిమా మీద మేకర్స్ కి మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్ కి కూడా దీనిపై అంతే హోప్స్ ఉన్నాయి.