TV9 Telugu
నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. తండ్రి అవ్వాలని ఉంది.: విజయ్ దేవరకొండ.
31 March 2024
క్రేజీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.
ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. తండ్రి అవ్వాలని ఉంది. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోను. లవ్ మ్యారేజ్ చేసుకుంటా..
నా ఫ్యామిలీకి కూడా ఆ అమ్మాయి తప్పక నచ్చాలి అని తెలిపాడు విజయ్. కొంతమంది తమిళ దర్శకులు నాకు స్టోరీలు చెప్పారు.
అందులో కొన్ని త్వరలోనే పట్టాలెక్కిస్తా. గౌతమ్ తిన్ననూరితో సినిమాలో చాలామంది కోలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు అన్నారు.
‘ఫ్యామిలీస్టార్ సినిమా యూనివర్సల్ కంటెంట్.. ఈ సినిమా అందరికి నచ్చుతుంది.. ఇది తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి