జోరు పెంచిన విజయ్.. ఏడాదికి రెండు సినిమాలు లక్ష్యం..

19 October 2023

లైగర్ తర్వాత అనుకోకుండా బ్రేక్ వచ్చింది.. ఇకపై అది రాకుండా చూసుకుంటా.. ఏడాదికి రెండు సినిమాలు చేసుకుంటా అంటూ మాటిచ్చారు విజయ్ దేవరకొండ.

అన్నట్లుగానే ఖుషి వచ్చిన నాలుగు నెలల్లోనే పరశురామ్ సినిమాను సిద్ధం చేస్తున్నారీయన. ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తైపోయింది. తాజాగా ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చింది టీం.

పరశురామ్ కంటే ముందే గౌతమ్ తిన్ననూరి సినిమాను మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.. VD12 కంటే ముందు VD13 పూర్తి చేస్తున్నారు.

గౌతమ్‌ది పాన్ ఇండియన్ సినిమా కావడం.. స్పాన్ కూడా ఎక్కువ కావడంతో అది సమ్మర్ 2024 తర్వాతే విడుదల కానుంది.

ఇదిలా ఉంటే పరశురామ్ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 18 సాయంత్రం 6.30 గంటలకు టీజర్ విడుదల కానుంది.

గీత గోవిందం తరహాలోనే ఫ్యామిలీ స్టార్‌ కూడా పూర్తిగా ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగానే రాబోతుంది. మృణాళ్ ఠాకూర్ ఇందులో హీరోయిన్.

బ్యాంకాక్, అమెరికా షెడ్యూల్స్ మినహా.. షూటింగ్ దాదాపు పూర్తైంది. చాలా తక్కువ టైమ్‌లో షూటింగ్ పూర్తి చేస్తున్నారు పరశురామ్.

దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ దేవరకొండ మొదటి సినిమా ఇది. దీని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.