03 September 2023
ఖుషి సినిమాలోని ఆరాధ్య పాటతో ఎంట్రీ విజయ్ దేవరకొండ నాగార్జునతో సరదాగా మాట్లాడారు. ఖుషి సినిమా సక్సెస్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా నాగార్జున నీ హీరోయిన్ సమంత ఎక్కడా అని అడగగా.. తాను న్యూయార్కులో ఉందని, ట్రీట్ మెంట్ తీసుకుంటుందంటూ విజయ్ చెప్పారు.
బిగ్ బాస్ హౌస్‌లోకి మొదట ఐదుగురు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ప్రియాంక జైన్, శివాజీ, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీ ఐదుగురు ఒక్కొక్కరుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆరో కంటెస్టెంట్‌గా ప్రముఖ సీనియర్ నటి షకీలా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా షకీలా కన్నీరుపెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల చేతిలో తానెన్ని కష్టాలు పడ్డానో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
ఏడో కంటెస్టెంట్‌గా డ్యాన్స్ మాస్టర్, కొరియో గ్రాఫర్ ఆట సందీప్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. సందీప్ తనదైన శైలిలో స్టెప్పులేస్తూ హౌస్‌లోకి అడుగుపెట్టి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
బిగ్‌బాస్ ఎనిమిదవ కంటెస్టెంట్‌గా కార్తీక దీపం సీరియల్‌లోని మోనిత పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించిన శోభాశెట్టి హౌస్‌లోకి అడుగుపెట్టారు. వారసుడు సినిమాలోని పాటకు స్టెప్పులేస్తూ శోభా హౌస్‌లోకి అడుగుపెట్టింది.