01 December 2023

నయన్ కు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌.!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందించాడు.

ఏకంగా 3 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా అందించాడు.

ఈ విషయాన్ని నయనతార తనఎక్స్ వేదికగా వెల్లడించింది. వెల్‌కమ్ హోం యు బ్యూటీ అంటూ కారుకి స్వాగతం పలికింది.

అత్యంత మధురమైన గిఫ్ట్ అందించిన భర్త విఘ్నేశ్‌కు ధన్యవాదాలు. ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది.

కారు లోగో ఫొటోలను షేర్ చేసింది. కాగా నవంబర్ 18న నయనతార 40వ వసంతంలోకి అడుగుపెట్టింది.

బర్త్‌డే సందర్భంగా హ్యాపీ బర్త్‌డే నా బంగారం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విఘ్నేశ్ శుభాకాంక్షలు తెలిపాడు.

ఇండియాలో మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ప్రారంభ ధర 2.69 కోట్లు కాగా గరిష్ఠంగా 3.4 కోట్ల వరకు ఉంది.

ఈ లగ్జరీ కారు రెండు మోడల్స్‌లో లభిస్తోంది. బేస్ మోడల్ ఎస్580, టాప్ మోడల్ ఎస్680గా ఉన్నాయి.