TV9 Telugu
సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ.! విద్యాబాలన్ కి సపోర్ట్ గా కామెంట్స్.
02 March 2024
గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ 26 ఫిబ్రవరి 2024న కన్నుమూశారు. ఆయన సంబంధించిన అంత్యక్రియలు ఫిబ్రవరి 27న జరిగాయి.
నటి విద్యాబాలన్ కూడా ఆయనను చివరి చూపు చూసేందుకు వచ్చారు. అక్కడ ఆమె ఓ అభిమాని కారణంగా ఇబ్బంది పడ్డారు.
హీరోయిన్ విద్య బాలన్ కు సంబందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తుంది.
ఇక ఆ వీడియోలో విద్యాబాలన్ అభిమాని.. ఫోన్ పట్టుకొని సెల్ఫీ కోసం ఆమెను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేశాడు..
విద్యాబాలన్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు అతడు. అయితే ఆమె ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండిపోయింది.
ఇప్పుడు ఈ వీడియో చూసిన జనాలు ఈ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో విద్యాబాలన్ ఓపికను కొనియాడుతున్నారు.
కొందరు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. సమయం ఏమిటో, స్థలం ఏమిటో అర్థం చేసుకోని వ్యక్తులు కొందరు ఉన్నారు.” అని..
“కొంతమందికి హృదయం లేదు. “, “ఆమె సెల్ఫీకి బదులుగా చెంపదెబ్బ కొట్టాలి.” అంటూ పలు కామెంట్లు రాస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి