ఫ్యామిలీ స్టార్ నుంచి క్రేజీ అప్డేట్.. 

TV9 Telugu

03 April 2024

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఫ్యామిలీ స్టార్.

దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ మూవీ యూనిటీ.

దీనికి విజయ్ దేవరకొండ, దిల్ రాజుతో పాటు హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ కూడా వచ్చారు. సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్న సమయంలో తాజాగా మరో అప్డేట్ ఇచ్చాసారు మేకర్స్. ఓ సాంగ్ విడుదల చేసారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి కళ్యాణి వచ్చా వచ్చా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసింది దీని చిత్రబృందం.

ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా రిచ్‌గా కళ్యాణి పాటను చిత్రీకరించారు చిత్ర దర్శకుడు పరశురామ్.

ఈ చిత్రం కచ్చితం ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు మూవీ మేకర్స్. విజయ్ కూడా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నారు.