వేట్టయన్‌ టీమ్‌ కీలక నిర్ణయం..  వసూళ్లు మరింత పెరిగేలా..

Battula Prudvi

18 October 2024

రజనీకాంత్ హీరోగా జై భీమ్ ఫేమ్ టిజె జ్ఞాన్ వేల్ తరకెక్కించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం వేట్టయన్. ది హంటర్ ఉపశీర్షిక.

రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, దగ్గుబాటి రానా, మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రితికా సింగ్, దుసరా విజయన్ లాంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీలో నటించారు.

దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలైన ఈ చిత్రం బ్లక్ బస్టర్ రివ్యూతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

వేట్టయన్ చిత్రానికి తొలిరోజనే ప్రపంచవ్యాప్తంగా భారీగా రూ.70 కోట్ల వరకు వసూళ్లుతో ప్రభంజనం సృష్టించింది.

వెట్టయన్ చిత్రన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 90 కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిందని అంటున్నారు.

ఇదిలా ఉంటె దసరా పండగ సెలవులు ముగియటంతో వేట్టయన్ టికెట్ రేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది చిత్రయూనిట్‌.

అక్టోబర్ 18 నుంచి మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు, సిటీ సింగిల్‌ స్క్రీన్స్‌లో 150 రూపాయల, డిస్ట్రిక్ట్ సింగిల్‌ స్క్రీన్స్‌లో 110 రూపాయలుగా టికెట్‌ రేట్లను నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో వసూళ్లు మరింత పెరుగుతాయన్న నమ్మకంతో ఉంది వేట్టయన్ చిత్రయూనిట్‌. మరి చుడాలిక ఏమి జరగనుందో.