09 October 2023
జగపతిబాబు సంచలన నిర్ణయం.. ఇక నుంచి నాకు సంబంధం లేదు.
ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ అడియన్స్ మనసు గెలుచుకున్నారు జగపతి బాబు. విలక్షణమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు.
లెజెండ్ సినిమాతో విలన్ గా రీఎంట్రీ ఇచ్చిన జగపతి బాబు ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీ అయ్యారు.
తాజాగా ట్విట్టర్ వేదికగా జగపతిబాబు ఓ కీలక ప్రకటన చేశారు. ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్ట్‌తో తనకు ఎలాంటి సంబంధం ఉండదని..
అభిమానులు ఆశించడం ఎక్కువ అయిపోయిందని.. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకువచ్చారంటూ పోస్ట్ చేశారు జగపతి బాబు. అందులో..
అందరికి నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం, శ్రేయోభిలాషుల్లాగే.. నా అఏభిమానులు కూడా నా ఎదుగుదలకు ముఖ్య కారణంగా భావించాను.
అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి నా అభిమానులకు నీడగా ఉన్నాను.
అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమయిన విషయం ఏంటంటే..
కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు.
మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇక నుంచి నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కు నాకు సంబంధం లేదు విరమించుకుంటున్నాను.
అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి.. జీవించనివ్వండి.. మీ జగపతి బాబు” అంటూ నోట్ విడుదల చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి