TV9 Telugu
చారి 111 థీమ్ సాంగ్.. విఐ ఆనంద్ నెక్స్ట్ మూవీ..
22 Febraury 2024
వెన్నెల కిషోర్ హీరోగా TG కీర్తి కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా చారి 111. మార్చ్ 1న విడుదల కానుంది ఈ చిత్రం.
తాజాగా ఈ చిత్రంలోని థీమ్ సాంగ్ విడుదలైంది. ఇందులో వెన్నెల కిషోర్‌కు జోడీగా సంయుక్త నటిస్తున్నారు. సైఫై కామెడీ థ్రిల్లర్‌గా వస్తుంది చారి 111.
2024లో వచ్చిన సంచలన విజయాల్లో తెలుగు సూపర్ హీరో సినిమా హనుమాన్ కూడా ఒకటి. ఇది సంక్రాంతి కానుకగా విడుదలైంది.
ఈ చిత్రం సాధించిన విజయం గురించి మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. 300 కోట్లకిపైగా వసూలు చేసింది హనుమాన్ మూవీ.
తాజాగా హనుమాన్ సినిమా నుంచి రఘునందన అంటూ సాగే వీడియో సాంగ్ ను యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.
ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఐ ఆనంద్.
తాజాగా ఈయన దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ మరో సినిమాను ప్రకటించింది ఈ టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ.
ఊరు పేరు భైరవకోన విడుదలై వారం రోజులు కూడా కాకుండానే నెక్ట్స్ సినిమా కోసం అడ్వాన్స్ తీసుకున్నారు ఆనంద్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి