TV9 Telugu

అఫీషియల్‌ OTTలో సైంధవ్‌.! డేట్ ఎప్పుడంటే.?

01 February 2024

విక్టరీ వెంకటేశ్ లేటేస్ట్ మూవీ ‘సైంధవ్’. సంక్రాంతి బరిలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

జనవరి 13న సంక్రాంతి బరిలో విడుదలై ప్రేక్షకులను మెప్పించాడు వెంకీ. 

ఈ మూవీలో వింటేజ్ వెంకటేష్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 

రిలీజ్‌కు ముందే మంచి బజ్ క్రియేట్ అవడంతో ఫ్యాన్సీ రేట్‌ కే డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్‌.

ఇక సినిమా రిలీజ్ అయి దాదాపు 20 రోజులు అయిందో లేదో.. అప్పుడే ఓటీటీ స్ట్రిమింగ్‌ కి రెడీ అయిపోయింది.

వెంకటేష్ సైంధవ్ మూవీని ఫిబ్రవరి 3 నుంచి తమ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు ప్రైమ్‌ తాజాగా అనౌన్స్ చేసింది.

అనౌన్స్‌ చేయడమే కాదు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ కూడా పెట్టింది.