సైంధవ్ సంక్రాంతికి పక్కా.. స్పిరిట్ మూవీ అప్‌డేట్..
26 December 2023
TV9 Telugu
తమ రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సైంధవ్ టీమ్. ఇది సంక్రాంతికి పక్కాగా వస్తుందని తెలిపారు.
హిట్ ఫేం శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు.
వెంకటేష్ నటించిన 75వ సినిమా కావటంతో సైంధవ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు మేకర్స్. శ్రద్ద శ్రీనాథ హీరోయిన్.
ఈ చిత్రంలో రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, ఆర్య, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
యానిమల్ సక్సెస్ తరువాత సందీప్ రెడ్డి వంగా చేయబోయే నెక్ట్స్ మూవీ ఏంటన్న విషయంలో సస్పెన్స్‌కు తెర దించారు సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్.
వచ్చే ఏడాది మే నుంచి ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్ సినిమా వర్క్ ప్రారంభం అవుతుందన్నారు హర్షవర్దన్.
ఈ అప్‌డేట్‌తో సందీప్ చేయబోయే నెక్ట్స్ మూవీ స్పిరిటే అన్న క్లారిటీ వచ్చేసింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
తాజాగా సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. కల్కి 2898 AD సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి