వెంకటేష్ నెక్స్ట్ మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆహాలో కాజల్..

TV9 Telugu

03 April 2024

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, క్రేజీ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది.

దీని గురించి చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ చిత్రంపై మరో అప్‌డేట్ వచ్చింది. ఉగాది సందర్భంగా సినిమాకు ముహూర్తం పెట్టబోతున్నట్లు తెలుస్తుంది.

ఎఫ్ 2, ఎఫ్ 3 తర్వాత వెంకీ, అనిల్ కాంబోలో రానున్న మూడో సినిమా ఇది. సంక్రాంతికి కలుద్దాం అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం కార్తిక.

ఈ సినిమాను ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం చేయనున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.

దర్శకుడు డీకేయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రెజీనా, జనని, రైజా విల్సన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

పేవ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై పదర్తి పద్మజ నిర్మించారు. ఆహా వేదికగా రానున్న ఈ సినిమాపై ఆసక్తి బాగానే ఉంది.