ఆ తర్వాతే VD12 షూటింగ్.. టాలీవుడ్ నిర్మాతల సమావేశం..

TV9 Telugu

30 January 2024

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా VD12. ఇందులో శ్రీలీల హీరోయిన్‌.

ఈ చిత్రనికి సూర్యదేవర నాగ వంశి, సాయి సౌజన్య నిర్మాతలు. షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న ప్రచారంపై స్పందించారు నిర్మాత నాగవంశీ.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోగా చేస్తు బిజీగా గడుపుతున్నారు.

ఇది పూర్తైన వెంటనే VD12 మొదలవుతుందని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

తెలుగు సినిమా నిర్మాతల మండలితో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్‌లో సమావేశం అయ్యారు.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు కొందరు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు.

అలాగే టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితుల విషయం గురించి కూడా ఈ నిర్మాతల మండలి మీటింగ్‌లో చర్చించారు.

దిల్ రాజు సహా టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలంతా తాజాగా జరిగిన నిర్మాతల మండలి సమావేశంలో పాల్గొన్నారు.