08 November 2023

నెట్‌ఫ్లిక్స్‌తో 8 కోట్ల డీల్ అబద్దం !! వరుణ్ టీం క్లారిటీ

గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా.. ఒకటే న్యూస్ వైరల్ అవుతోంది. 

ఓటీటీ జెయింట్‌ నెట్‌ఫ్లిక్స్.. 8 కోట్లకు వరుణ్‌లవ్‌ పెళ్లి వీడియోను తీసుకుందనే న్యూస్! అంతటా వైరల్ అవుతోంది. 

అయితే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న ఈ రూమర్స్‌పై  తాజాగా స్పందించింది వరుణ్‌ టీం

ఆ న్యూస్ తప్పని .. ఆ వార్తలు నమ్మొద్దని చెబుతూనే.. వరుణ్ లవ్‌ పెళ్లి రైట్స్‌ను ఓటీటీ సంస్థకు ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది 

అనవసరంగా ఇలాంటి రూమర్స్‌ క్రియేట్ చేయడం .. స్ప్రెడ్ చేయడం మానుకోవాలని కూడా సూచించింది. 

ఇక ఈ న్యూస్ కాస్తా నెట్టింట వైరల్ అవడంతో.. మెగా ప్రిన్స్‌ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

ఇటలీలో జరిగిన వీరి పెళ్లిని కళ్లరా చూద్దామనుకున్న తమ ఆశ.. ఇలా ఎండ్ అయిందేంటని  నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.