ఓటీటీలోకి ఆపరేషన్ వ్యాలెంటైన్ 

TV9 Telugu

10 March 2024

గని, గాంఢీవ ధారి అర్జున వంటి ప్లాఫుల తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.

బాలీవుడ్ బ్యూటీ, ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఇందులో కథానాయిక. శక్తి ప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఒకేసారి రిలీజైంది. డీసెంట్‌ టాక్ తెచ్చుకుంది. అలాంటి ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వరుణ్ తేజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు, హిందీ భాష‌లతో పాటు ఇతర దక్షిణాది లాంగ్వెజెస్ లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంద‌ని టాక్ నడుస్తోంది.

అంతేకాదు త్వరలోనే ఆపరేషన్ వాలంటైన్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.