లావణ్య త్రిపాఠి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది
తన అందం, గ్లామర్ తో అందరి మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో లావణ్యకు వరుస ఆఫర్లు వచ్చాయి.
యంగ్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది ఈ చిన్నది. అయితే వరుణ్ తేజ్ కి జంటగా రెండు సినిమాల్లో నటించింది.
ఇది ఇలా ఉంటే వరుణ్ లావణ్య మధ్య రిలేషన్ షిప్ నడుస్తుంది అనే రూమర్స్ రాగా అలాంటిది ఏమీ లేదని వరుణ్ తేజ్ కొట్టిపడేశాడు.
కొన్ని రోజులు తర్వాత సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చారు. అయితే తాజాగా లావణ్య ప్రెగ్నెంట్ అని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.
మంగళవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు లావణ్య వరుణ్ దంపతులు.. ఈ ఫోటోల్లో లావణ్య కాస్త బొద్దుగా కనిపించగా పొట్ట కనిపించకండా ఆమె చీర చెంగుతో కవర్ చేశారు.
ఈ తీరును చూసి లావణ్య ప్రెగ్నెంట్ అని భావిస్తున్నారు. దానితో పాటు ఇటీవల కాలంలో లావణ్య పెద్దగా బయట కనిపించడం తో మెగా ఇంటికి మరో వారసుడు రాబోతున్నాడు అని ఫిక్స్ అవుతున్నారు.