16 December 2023

నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.. తన లవ్‌ను ఫిదా చేసిన వరుణ్‌

దాదాపు 7 సంవత్సారల ప్రేమ.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు వరుణ్‌, లావణ్య.

ఇప్పుడు తన లవ్లీ వైఫ్‌ లావణ్య బర్త్‌ డే...! మరి వరుణ్‌ ఏం ట్వీట్ చేశాడు. ఏం సర్‌ప్రైజ్ ఇచ్చాడు? అని అనుకుంటున్నారా?

ఆ పోస్ట్‌తో .. కొట్టొచ్చినట్టు తన ప్రేమను తెలిసేలా చేశాడు. హవ్‌ క్యూట్‌ అనే కామెంట్ కూడా నెటిజన్ల నంచి వచ్చేలా చేసుకుంటున్నాడు.

 తన అప్‌ కమింగ్ సినిమా షూట్లతో తెగ బిజీగా ఉన్న వరుణ్.. వైఫ్ బర్త్‌ డే కావడంతో ఇన్‌స్టా వేదికగా విషెస్ చెప్పాడు.

హ్యాపీ బర్త్‌డే బేబీ అంటూ... మెగా ప్రిన్స్ వరుణ్ రాసుకొచ్చాడు.

నువ్వు నా జీవితంలోకి వచ్చి.. నా జీవితాన్ని ప్రకాశవంతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ తన పోస్ట్‌లో కోట్ చేశాడు.

తన పెళ్లి ఫోటోలను కూడా షేర్ చేశాడు. వాటితో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు ఈ మెగా హీరో..