TV9 Telugu

వరుణ్ తో చిరు.. RC16లో ఆ బాలీవుడ్ నటుడు..

27 Febraury 2024

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న విడుదల కానుంది.

పుల్వామా ఉగ్రదాడి ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్‌. ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు వరుణ్ తేజ్.

ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో ఘనంగా జరిగిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా చిరంజీవి వచ్చారు.

గీతాంజలి హిట్ అవ్వడంతో.. దానికి సీక్వెల్ చేసారు దర్శక నిర్మాతలు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్ విడుదలైంది.

ఈ టీజర్‌లో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, కమెడియన్ సత్య, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. వాళ్లతో పాటు అదనంగా సునీల్ కూడా ఉన్నారు.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న RC16 సినిమా మొదలు కాకముందే వరస అప్‌డేట్స్ వస్తున్నాయి.

ఈ సినిమాలో జాన్వీకపూర్‌ నటిస్తున్నారని బోనీ కపూర్ ఖరారు చేసారు. ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి సైతం కీలక పాత్ర చేస్తున్నారు.

ఈ ఇద్దరితో పాటు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా RC16 మూవీలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.