ఆపరేషన్ వాలెంటైన్ ముచ్చట్లు.. మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్డేట్..
TV9 Telugu
13 February 2024
మెగా వారసుడు వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న భారీ ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఆపరేషన్ వాలెంటైన్.
సర్జికల్ స్ట్రిక్స్ నేపథ్యంలో తెరకెక్కితున్న ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శక్తి ప్రతాప్ డైరక్ట్ చేశారు.
తెలుగుతో పాటు హిందీలోనూ విడుదలవుతున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా మీద గట్టి హోప్స్ పెట్టుకున్నారు వరుణ్‌తేజ్.
రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే ఈ మూవీతో తెలుగులో కథానాయకిగా పరిచయం అవుతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. టీజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మాతలు.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ సినిమాకు సంబంధించి ఇటీవల కీ షెడ్యూల్ చేశారు.
ఈ షెడ్యూల్ పూర్తయిందని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు డైరక్టర్ హరీష్ శంకర్. మోస్ట్ శాటిస్‌ఫైయింగ్ షెడ్యూల్ అని అన్నారు హరీష్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి