TV9 Telugu
ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్.. రాయన్‌తో సందీప్..
22 Febraury 2024
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న ఇండియన్ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వాలంటైన్.
కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2019లో జరిగిన పుల్వామా దాడి ఆధారంగా వస్తున్న చిత్రమిది.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేసారు. అలాగే హిందీ ట్రైలర్‌ను సల్మాన్ ఖాన్ విడుదల చేసారు.
మార్చ్ 1న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంది. సోనీ పిక్చర్స్ పతాకంపై సందీప్ ముద్దా నిర్మించారు
తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ సినిమాలు చేస్తూ బాగా బిజీ అవుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.
ఈ మధ్యే ఊరు పేరు భైరవకోనతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సందీప్. ఈ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా హిట్ అయింది.
అంతలోనే ఈయన మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యారు. ధనుష్ 50వ సినిమా రాయన్‌లో కీలక పాత్రలో నటిస్తున్నారు సందీప్ కిషన్.
దీని ఫస్ట్ లుక్‌లో ధనుష్‌తో పాటు సందీప్ కూడా ఉన్నారు. ఇటీవల వీరిద్దరూ కెప్టెన్ మిల్లర్ మూవీలో కలిసి నటించారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి