TV9 Telugu

వేలంటైన్స్ డే రోజున లావణ్య గిఫ్ట్ ఇచ్చిందా? వరుణ్‌ ఆన్సర్ ఇదే

18 Febraury 2024

 గతేడాది నవంబర్ లో ఇటలీ వేదికగా మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి

 అయితే తమ వివాహం జరిగిన తర్వాత చాలా రోజుల పాటు తమ సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

ఇప్పుడిప్పుడే తమ ప్రొఫెషనల్ పనుల్లో బిజిబిజీగా మారుతున్నారీ లవ్లీ కపుల్. ఇటీవల మిస్ పర్పెక్ట్ సిరీస్ తో ముందుకొచ్చింది లావణ్య.

ఇప్పుడు 'ఆపరేషన్ వేలంటైన్' అంటూ సరికొత్త సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ యాక్షన్ థ్రిల్లర్ మార్చి1న తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ కానుంది.

ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ తన సతీమణి లావణ్య త్రిపాఠి గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఈ వేలంటైన్స్ డేకు లావణ్య త్రిపాఠి గిఫ్ట్ గా ఏమిచ్చారని ప్రశ్నించగా.. తనకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదన్నాడు వరుణ్ తేజ్.

అయితే ఇద్దరం కలిసి సరదాగా విహార యాత్రకు వెళ్లామని  మూవీ ప్రమోషన్లలో చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్