కాక్‌ టైల్‌ పార్టీలో ఎంజాయ్.. మెగా వెడ్డింగ్ విశేషాలు ఇవే..

31 October 2023

నవంబర్ 1 (బుధవారం) వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం ఘనంగా ఇటలీలో జరగనున్న సంగతి అందరికి తెలిసిందే.

దీని కోసం కొన్నీ రోజుల క్రితం నుంచి మెగా కుటుంబం అంతా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఇటలీలో ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో గడుపుతున్నారు.

తాజాగా మెగా ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా సోమవారం (అక్టోబర్ 30) రాత్రి ఇటలీలో కాక్ టైల్ పార్టీ ఘనంగా జరిగింది.

ఈ కాక్ టైల్ పార్టీకి వధూవరులు ఇద్దరు వైట్ కలర్ దుస్తుల్లో వెళ్లగా.. సాయి ధరమ్ తేజ్, బన్నీ, చెర్రీ స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకున్నారు.

వరుణ్‌, లావణ్యలతో పాటు రామ్‌ చరణ్‌- ఉపాసన, అల్లు అర్జున్‌, సాయి ధరమ్‌ తేజ్‌, చిరు సతీమణి సురేఖ, లావణ్య కుటుంబ సభ్యులు ఈ పార్టీలో సందడి చేశారు.

ఇదిలా ఉంటె ప్రీ వెడ్డింగ్‌ వేడుకలో భాగంగా మంగళవారం (అక్టోబర్‌ 31)న హల్దీ, మెహెందీ వేడుకలు జరగనున్నాయి.

ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా హల్దీ, మెహందీకి హాజరయ్యే అతిథుల కోసం ఓ స్పెషల్ డ్రెస్‌ కోడ్‌ కూడా ఉందట.

ముహూర్తం విషయానికి వస్తే నవంబర్ 1 (బుధవారం) మధ్యాహ్నం 2.48 గంటలకు వరుణ్ లావణ్య వేదమంత్రాల సాక్షిగా ఒక్కటి కాబోతున్నారు.