వరుణ్ - లవణ్య వెడ్డింగ్ ఎక్కడంటే..?

08 October 2023

వరుణ్ తేజ్ - లవణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని చాలా రోజులుగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వారిద్దరి పెళ్లికి సంబంధించి ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరగనుంది.

ఆ మేరకు వారిద్దరి పెళ్లికి సంబంధించి ఉపాసన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇటలీలోని టుస్కానీలో వారి వివాహం గ్రాండ్‌గా జరగనుంది.

ఇటలీలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఇరు కుటుంబాలకు చెందిన సన్నిహితులు, మిత్రులు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని టాక్.

ఇటలీలో వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్‌తో పాటు డెహ్రాడూన్‌లో గ్రాండ్ రిసెప్షన్స్ ఇచ్చేందుకు వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించనున్నారు.

లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్‌లో పెరిగారు. అందుకే వారి తరఫు సన్నిహితుల కోసం అక్కడ కూడా రిసెప్షన్ ఇవ్వాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

వరుణ్ - లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి కూడా పాల్గొన్నారు.

ప్రీ వెడ్డింగ్ ఫొటోలలో పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ నెలాఖరులో ఇటలీలో జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పవన్ కూడా పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది.