సరిగ్గా ఆ మూహూర్తంలోనే లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు.. ఎందుకంటే?
01 నవంబర్ 2023
మరికొన్ని గంటల్లో టాలీవుడ్ ప్రేమ పక్షులు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
బుధవారం (నవంబర్ 1) మధ్యాహ్నం
సరిగ్గా 2:48 గంటలకు లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
పెళ్లికి ముందే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠీల జాతకాన్ని చూసి పురోహితులే ఈ ముహూర్తపు సమయాన్ని నిశ్చయించారట
దంపతులిద్దరూ కలకాలం సంతోషం ఉండాలని ఈ మూహూర్తపు సమయాన్ని ఫైనలైజ్ చేశారట పురోహితులు. ఇరు కుటుంబ సభ్యులు కూడా దీనిని అంగీకరించారట
ఇటలీలోని టుస్కానీ వేదికగా వరుణ్, లావణ్యల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి.
మెగా, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది
ఇక్కడ క్లిక్ చేయండి..