వర్షిణి అందానికి ఆ మన్మధుడు కూడా ఫిదా..
TV9 Telugu
29 July 2024
6 ఏప్రిల్ 1994న లో హైదరాబాద్ లో జన్మించింది ముద్దగుమ్మ వర్షిణి సౌందరరాజన్. షామిలీ సౌందరరాజన్ మరో పేరు.
ఈ బ్యూటీ తల్లి పేరు ఆలిస్ సౌందరరాజన్, తండ్రి పేరు బాబు సౌందరరాజన్. వీరు హైదరాబాద్ లో స్థిరపడిన తమిళనాడుకి చెందినవారు.
తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ అందాల భామ.
హైదరాబాద్‌లోని కింగ్ కోటిలోని సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది.
మోడల్‌గా యాడ్స్ లో నటిస్తూ తన కెరీర్‌ను ప్రారంభించినప్పటికీ త్వరలోనే నటన వైపు మళ్లింది ఈ ముద్దుగుమ్మ.
2014లో చందమామ కథలు తొలిసారిగా తెలుగులో నటించింది. ఇది ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
ఆ తర్వాత తెలుగులో లవర్స్, కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో నటించింది ఈ వయ్యారి భామ.
ఆ మధ్య సమంత ప్రధాన పాత్రలో వచ్చిన `శాకుంతలం` చిత్రంలో నటించింది. మరోవైపు `భాగ్ సాలే` మూవీలోనూ మెరిసింది ఈ అందాల తార.
ఇక్కడ క్లిక్ చెయ్యండి