25 April 2024
ఆ ఛాన్స్ అతడికి లేదు. కాబోయేవాడిని అప్పుడే కంట్రోల్లో పెట్టిన జయమ్మ
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో విలనిజంతో మెప్పిస్తున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది.
ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వస్తున్న శబరిలో ప్రధాన పాత్ర పోషించింది.
ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఆమె తనకు కాబోయే భర్త నికోలయ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే అతడికి ఓ ఛాన్స్ లేదంటుంది.
ఇటీవలే తన స్నేహితుడు నికోలయ్తో నిశ్చితార్థం చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి.
ఓ ఇంటర్వ్యూలో వరలక్ష్మి మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్త నికోలయ్ తన సినిమాలు బాగుంటే బాగున్నాయని.. బాలేదంటే బాలేదని చెబుతారని తెలిపింది.
కానీ అతడికి బాలేదని చెప్పే అవకాశం లేదంటూ తేల్చీ చెప్పేసింది. ఇక కాబోయేవాడి గురించి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
కాబోయే భర్తను అప్పుడే కంట్రోల్లో పెట్టేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక తన పెళ్లి ఈ ఏడాదిలోనే జరుగుతుందంటూ క్లారిటీ ఇచ్చింది జయమ్మ.
తెలుగులో కూర్మ నాయకి, తమిళంలో ధనుష్ సినిమా.. అలాగే కన్నడలో సుదీప్ కిచ్చతో మ్యాక్స్ సినిమా చేస్తున్నట్లు.. మరో మూడు డిస్కషన్లో ఉన్నట్లు తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి.