29 December 2023

Pic credit - Instagram

క్రేజీ ఆఫర్ కొట్టేసిన 'బేబీ' బ్యూటీ.. ఆ యంగ్ హీరో సరసన వైష్ణవి.. 

TV9 Telugu

బేబీ సినిమాతో తెలుగుతెరకు కథానాయికగా పరిచయమైంది వైష్ణవి చైతన్య. ఈ సినిమాతో తెలుగమ్మాయికి ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ వచ్చేసింది.

ఇందులో వైష్ణవి చైతన్య  నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ తర్వాత తెలుగులో వైష్ణవికి  వరుస అవకాశాలు వచ్చాయి. 

ఇప్పుడు మరోసారి హీరో ఆనంద్ దేవరకొండ జోడిగా నటిస్తుంది వైష్ణవి. అలాగే ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లుగా నెట్టింట టాక్ వినిపిస్తుంది. 

అయితే ఇప్పుడు వైష్ణవి మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ జోడిగా ఈ ముద్దుగుమ్మ కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు. 

అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

దీంతో ఇప్పుడు వైష్ణవి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని ఆఫర్స్ వచ్చాయని నెట్టింట టాక్ వినిపిస్తుంది. 

ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బేబీ తర్వాత వైష్ణవి జాగ్రత్తగా తన నెక్ట్స్ సినిమాలను ఎంచుకుంటుందని తెలుస్తోంది.