01 November 2025
ఆ హీరో అంటే చచ్చేంత ఇష్టం.. వైష్ణవికి ఇష్టమైన స్టార్ అతడే..
Rajitha Chanti
Pic credit - Instagram
నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హైదరాబాద్ అమ్మాయి వైష్ణవి చైతన్య.
ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించింది. ఆనంద్ దేవరకొండ సరసన బేబీ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
ఈ సినిమాతో ఒక్కసారిగా ఆమె జీవితం మలుపు తిరిగింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.
దీంతో తెలుగు సినిమా ప్రపంచంలో వైష్ణవి పేరు మారుమోగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయన్ గా మారింది.
కానీ బేబీ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్టు అందుకోలేకపోయింది. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తుండగా.. చివరగా జాక్ చిత్రంలో నటించింది.
ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తనకు తెలుగులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.
తన ఫస్ట్ క్రష్ సైతం రామ్ పోతినేని అని, అలాగే అతడే తన ఫేవరేట్ హీరో అని తెలిపింది. దీంతో వైష్ణవి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆనంద్ దేవరకొండ సరసన మరో ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్