ఈ కోమలిని పెనవేసిన ఆ చీరకు ఎంత గర్వమో.. చార్మింగ్ వైష్ణవి..
Prudvi Battula
Credit: Instagram
03 February 2025
4 జనవరి 1994న ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉంటుంది.
2023లో రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బేబీ చిత్రంలో కథానాయకిగా అరంగేట్రం చేసింది ఈ భామ. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రమిది.
బేబీ సినిమాకి ఫిల్మ్‌ఫేర్ వారిచే ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డ్, SIIMA ద్వారా ఉత్తమ మహిళా డెబ్యూ అవార్డు గెలుచుకుంది.
2024లో వచ్చిన హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ లవ్ మీ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
వీటికి ముందు టచ్ చేసి చూడు, మాయ పేరేమిటో, అల వైకుంఠపురములో రంగ్‌దే, ప్రేమదేశం, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.
అలాగే 2022లో తమిళ సినిమా వలిమైలో రమ్య అనే పాత్రతో కోలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ వయ్యారి భామ.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‌లతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా ఎదిగింది. సాఫ్ట్‌వేర్ డెవలపర్ యూట్యూబ్ సిరీస్‌తో చాల ఫేమస్ అయింది.
ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డకి జోడీగా జాక్ మూవీతో పాటు యాన్ అన్ ఫినిష్డ్ స్టోరీ అనే రెండు సినిమాల్లో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫిల్మ్ స్టూడియోస్ ప్రపంచంలోనే అతి పెద్దవి..
బాలయ్య పక్కన లీడ్ రోల్.. అవకాశాలు మాత్రం నిల్.. ఎవరా భామలు.?
ప్రపంచంలోనే భారీ వసూళ్లతో సత్తా చాటిన టాప్ 10 సినిమాలు..