బతుకమ్మతో మెరిసిన బేబీ బ్యూటీ..

24 October 2023

ఆనంద్ దేవరకొండకి జోడిగా నటించిన బేబీ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవి చైతన్య.

ఈ చిత్రానికి ముందు ఆలా వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ చెల్లిగా, వరుడు కావలెనులో ఓ పాత్రలో కనిపించింది.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది వయ్యారి భామ వైష్ణవి.

యూట్యూబ్ సిరీస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ తర్వాత ఈ బ్యూటీకి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి.

ఇటీవల ఏజ్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ బేబీ చిత్రంలో కథానాయకిగా నటించింది ఈ భామ. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రమిది.

ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో సందడి చేసింది వైష్ణవి.

ఈ పండుగ మీకు సానుకూలత,ఆనందాన్ని కలిగిస్తుంది. బతుకమ్మ శుభాకాంక్షలు అంటూ ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది వైష్ణవి.

ఆ ఫొటోలో వైట్ సారీలో కోనేటిలో బతుకమ్మను వదులుతూ కనిపించి ఈ అందాల తార. ఈ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.