సడన్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’..

14 September 2023

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. శ్రీలీల కథానాయకిగా నటిస్తుంది.

‘గబ్బర్‌సింగ్‌’ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.

ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టిల్స్ సోషల్ మీడియా షేర్ చేసింది చిత్రబృందం.

ఇందులో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ వేషధారణలో ఆకట్టుకున్నారు. అలాగే హరీష్ శంకర్ సీన్ వివరిస్తున్న కనిపించరు.

తాజాగా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ  షెడ్యూల్ లో పవన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

దీనితో పాటు క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు, సుజీత్ దర్శకత్వంలో ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.

ఇదేకాదు కన్నడ కబ్జా చాప్టర్ 2 చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దీని గురించి ఇంకా తెలియాల్సి ఉంది.