రిషబ్ పంత్‌ను ఊర్వశి రౌతేలా అవమానించిందా ??

TV9 Telugu

03  April 2024

భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కెరీర్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా మలుచుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రాణిస్తున్నాడు

2022 డిసెంబరులో ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ కొన్ని మాసాల పాటు బెడ్‌కే పరిమితమయ్యారు. కఠోర శ్రమతో తిరిగి బ్యాట్ పట్టాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు

15 మాసాల విరామం తర్వాత ఐపీఎల్‌లో ఆడుతున్న పంత్.. బ్యాటింగ్‌లో తన సత్తా చాటుతున్నాడు. సీఎస్కేతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంత్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.

రిషబ్ పంత్ మళ్లీ బ్యాట్ పట్టి మెరుపులు మెరిపిస్తుండటంతో అతని ఫ్యాన్స్‌, క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రిషబ్ పంత్ మళ్లీ ట్రాక్‌లోకి రావడం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.

అదే సమయంలో బాలీవుడ్ నటి ఈశ్వశి రౌతేలా మరోసారి రిషబ్ పంత్ ఫ్యాన్స్‌ను కోపం తెప్పించారు. గతంలో పంత్‌తో ఈ బాలీవుడ్ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. 

తాజాగా ఓ మ్యాట్రిమోనీ సైట్‌కు సంబంధించి వ్యాపార ప్రకటనలో ఊర్వశి చేసిన కామెంట్స్‌ పంత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. 

వ్యాపారవేత్తలు, నటులు, క్రికెటర్లు ఎవరూ తనకు సరితూగే ఎత్తుతో దొరకడం లేదంటూ ఊర్వశి ఆ ప్రకటనలో చెప్పుకొచ్చింది.

ఇది రిషబ్ పంత్‌ను ఉద్దేశించిన కామెంట్స్‌గా ఆ క్రికెటర్ ఫ్యాన్స్ ఊర్వశి రౌతేలాపై కుతకుతలాడుతున్నారు. రిషబ్ పంత్‌ను ఊర్వశి అవమానించిందంటూ మండిపడుతున్నారు. 

అయితే దీనిపై స్పందించిన ఊర్వశి..యాడ్ స్క్రిప్ట్ పూర్తిగా ఆ కంపెనీ తనకు అందించిందని తన ఇన్‌స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది. ఆ కామెంట్స్‌ను దయచేసి పాజిటివ్‌గా తీసుకోవాలని కోరింది.