ఆ స్వర్గలోకంలో రంభ కూడా ఈమెకు సరి తూగదేమో..

17 December 2023

25 ఫిబ్రవరి 1994న హరిద్వార్‌లో మీరా రౌటేలా, మన్వర్ సింగ్ రౌతేలా దంపతులకి జన్మించింది అందాల బ్యూటీ ఊర్వశి రౌటేలా.

ఈమె గర్వాలీ రాజ్‌పుత్ కుటుంబనికి చెందినది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో కోటద్వార్ ఈమె స్వస్థలం.

ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్‌లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్‌లో తన పాఠశాల విద్యను అభ్యసించింది ఈ వయ్యారి భామ.

తర్వాత హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళింది. ఢిల్లీలోని గార్గి కళాశాలలో తన డిగ్రీ విద్యను పూర్తిచేసింది ఈ బ్యూటీ.

మిస్ దివా- మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్ గెలుచుకున్న తర్వాత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ముద్దుగుమ్మ.

15 సంవత్సరాల వయస్సులోనే మోడలింగ్ వృత్తిని ప్రారంభించిన ఈ భామ మిస్ టీన్ ఇండియా 2009 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. అక్కడ ఆమె సన్నీ డియోల్ సరసన కథానాయికగా నటించింది.

వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద వంటి తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి ఆకట్టుకుంది ఈ భామ.