విలక్షణ నటుడు ఉపేంద్ర లీడ్ రోల్‌లో నటిస్తూ దర్శకత్వం వహించిన సర్రియలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'యూ ఐ'.
జీ మనోహరన్, శ్రీకాంత్ కేపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు రిలీజ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.
తాజాగా హైదరాబాద్‌లో తెలుగు వర్షన్ డబ్బింగ్ చెప్పారు ఉపేంద్ర. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి త్వరలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
రమాకాంత్, అవంతిక, భానుశ్రీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సముద్రుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మాజీ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మే 3న సినిమా రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మధ్యే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో దర్శకుడు బోయపాటి శీను ఓ సినిమాకు సైన్ చేసారు. అయితే ఇది అల్లు అర్జున్ కోసమే అని ముందు ప్రచారం జరిగింది.
ఆ తర్వాత కాదు ఇందులో హీరో బాలయ్య అన్నారు.. ఇప్పుడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ పేరు బలంగా వినిపిస్తుంది.
త్వరలోనే ఈ సినిమాపై పూర్తి క్లారిటీ రానుంది. బోయపాటి, విజయ్ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం అది ఫుల్ మాస్‌గా ఉండబోతుంది.