‘యూఐ : ది మూవీ’తో ఉపేంద్ర కొత్త ప్రపంచం.. ఫైటర్ సాంగ్..

TV9 Telugu

10 January 2024

ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్ లాంటి విభిన్నమైన చిత్రాలతో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మెప్పించారు ఉపేంద్ర.

తాజాగా చాలా రోజుల తర్వాత ఈయన నుంచి మరో సినిమా వస్తుంది. దాని పేరు ‘యూఐ : ది మూవీ’. స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తీసుకొస్తున్నారు ఉపేంద్ర.

దీంతో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు ఈయన. తాజాగా చిన్న గ్లింప్స్ విడుదల చేసారు. ఇది ఆకట్టుకొనేలా ఉంది.

విజయ్‌ హీరోగా వెంకట్‌ ప్రభు డైరక్ట్ చేస్తున్న సినిమా గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌. దీని షూటింగ్‌ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఇది పూర్తి కాగానే శ్రీలంకకు వెళ్లనుంది టీమ్‌.

ఫిబ్రవరి నుంచి రాజస్తాన్‌లో షూటింగ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

హృతిక్ రోషన్, దీపిక పదుకొనే జంటగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ఫైటర్. జనవరి 25న విడుదల కానుంది ఈ చిత్రం.

తాజాగా ఈ చిత్రం నుంచి హీర్ ఆస్మానీ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇందులో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.

ఈ మాస్ యాక్షన్ సినిమాలో ఎయిర్ స్పేస్‌కు సంబంధించిన విజువల్స్‌తో పాటను చిత్రీకరించారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.