హైదరాబాద్‌లో ‘గుంటూరు కారం’ షూటింగ్..

14 September 2023

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం  ‘గుంటూరు కారం’. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది.

ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల జంటగా కనిపించనున్నారు. ఈ మూవీలో మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పథకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మహేష్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్లో  మహేష్, ప్రకాష్ రాజ్ పై ఓ కీలక ఘట్టాన్ని చిత్రీకరించనున్నారు మూవీ మేకర్స్.

ఈ చిత్రానికి థమన్ స్వరాలందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల ఆకట్టుకున్నాయి.

గతంలో మహేష్, త్రివిక్రమ్ కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. ఇందులో అతడు హిట్ కాగా, ఖలేజా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

‘గుంటూరు కారం’ తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీ కోసం సినీప్రేమికులు ఎదురుచూస్తున్నారు.