60ల్లో వ్యాపారవేత్తగా అత్తమ్మ! ఉపాసన..

TV9 Telugu

10 March 2024

అరవై ఏళ్లు దాటాక వ్యాపారం మొదలుపెట్టిన తన అత్తగారు సురేఖని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు ఉపాసన కొణిదెల.

ఎంటర్‌ప్రెన్యుయర్‌గా ఆమె సిక్ట్సీస్‌లో రాణిస్తుంటే చూడటానికి ముచ్చటేస్తోందని అన్నారు మెగా కోడలు ఉపాసన.

అత్తమ్మాస్‌ కిచెన్‌ని ఇటీవల ఓపెన్‌ చేశారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల.

ఈ విషయాన్ని విమెన్స్ డే సందర్భంగా ప్రజలతో మరోసారి పంచుకున్నారు స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల.

చిరు తల్లి అంజన దేవి, చిరు భార్యతో ఉపాసన కొణిదెల ఉన్న పిక్‌ ఇన్‌స్టంట్‌గా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇలాంటి అత్తమ్మలు, అమ్మలు వ్యాపారవేత్తలుగా మారితే మన దేశం ఎంత ధనిక దేశమవుతుందో కదా అన్నారు ఉపాసన.

ఉమెన్స్ డే సందర్భంగా రామ చరణ్ బెటర్ హాఫ్ ఉపాసన అన్న మాటలు సోషల్ మీడియాలో అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

అత్తమ్మాస్‌ కిచెన్‌ ప్రొరంభించినప్పటి నుంచి రకరకాల వంటలను కూడా ఆ పేజ్‌లో షేర్‌ చేస్తున్నారు మెగా కోడలు ఉపాసన.