తమిళసైని కలిసిన ఉపాసన.. ఫ్యామిలీ స్టార్ కోసం క్రేజీ డేట్..

TV9 Telugu

05 February  2024

పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాలతోనే ఎక్కువగా కాలం గడుపుతుంటారు.

తాజాగా మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైను మర్యాదపూర్వంగా కలిసారు.

తెలంగాణలోని కొన్ని ట్రైబల్ ఏరియాలను ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధి కోసం పాటు పడాలని చూస్తున్నారు ఉపాసన.

ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్ ను కలిసి తన ఆసక్తి గురించి చెప్పారు ఉపాసన కొణిదెల.

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన కుటుంబ కథ చిత్రం ఫ్యామిలీ స్టార్ ఎప్రిల్ 5న విడుదల కానుంది.

ఈ డేట్ కోసం చాలా సినిమాలు పోటీ పడుతుంటే.. దిల్ రాజు లాక్ చేసారు. 2024లోనే బెస్ట్ రిలీజ్ డేట్స్‌లో ఎప్రిల్ 5 ఒకటి.

5, 6, 7 తేదీలు వీకెండ్‌ అయితే.. ఎప్రిల్ 9న ఉగాది.. 11న ఈద్ హాలీడే రానుంది.. ఇక ఎప్రిల్ 14న సండే, 17న శ్రీ రామనవమి ఉన్నాయి.

ఈ లెక్కన రెండు వారాల్లో వీకెండ్ సహా.. 3 పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయి. మూవీ హిట్ టాక్ వస్తే చాలు భారీ వసూళ్లు రావడం ఖాయం.