ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్‌ షో స్పెషల్ ఎపిసోడ్.. కోటబొమ్మాలి అప్డేట్..

14 November 2023

దీపావళి సందర్భంగా టాలీవుడ్ మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇచ్చారు. సలార్ టీమ్ ట్రైలర్ లాంచ్‌ డేట్‌ను రివీల్ చేసారు.

సైంధవ్‌, హనుమాన్ సినిమాల నుంచి సాంగ్ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చాయి. ఫ్యామిలీ స్టార్‌, భీమా సినిమాల మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

ఆహాలో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో మరో మెగా ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ మీట్స్ బాలయ్య పేరుతో స్పెషల్ ఎపిసోడ్  రానుంది.

యానిమల్ మూవీ టీమ్‌ రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, సందీప్ రెడ్డి వంగా బాలయ్య షోలో సందడి చేయబోతున్నారు.

కోటబొమ్మాలి పోలీస్‌ స్టేషన్ టీమ్ ప్రమోషన్‌లో దూసుకుపోతోంది. తాజాగా సెకండ్ సింగిల్‌ను కోట బొమ్మాళిలోని కోటమ్మ తల్లి టెంపుల్‌లో రిలీజ్ చేశారు మేకర్స్.

కోలీవుడ్ హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెబెల్‌. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్‌.

స్టార్‌ హీరో సూర్య సోషల్ మీడియా ద్వారా టీజర్‌ను లాంచ్‌ చేశారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కేజీ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకు నికేష్‌ ఆర్ఎస్‌ దర్శకుడు.

ఇటీవల డిజిటల్ రిలీజ్ అయిన పిప్పా  సినిమా కోసం రెహమాన్ కంపోజ్ చేసిన 'కరార్‌ ఓయ్‌ లౌహో' అనే బెంగాలీ పాట అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.